మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి అద‌న‌పు ఈవో

0 8,584

తిరుమ‌ల ముచ్చట్లు :

 

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని  గురురాఘవేంద్ర స్వామివారి 350వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరపున అద‌న‌పు ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి మంగ‌ళ‌వారం ఉదయం శేషవస్త్రం సమర్పించారు.హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్‌ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి   సుబుదేంద్రతీర్థ స్వామివారికి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా   సుబుదేంద్రతీర్థ స్వామివారు అద‌న‌పు ఈవోను ఆశీర్వదించారు.ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌యం ఒఎస్డీ  పాల శేషాద్రి పాల్గొన్నారు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags: TTD Adhanapu Evo presented the relics to Mantralayam Sri Raghavendraswamy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page