రాజారెడ్డి అడ్వర్యంలో అగ్రి గోల్డ్ భాధితులు సీ. యం. చిత్రపటానికి పాలాభిషేకం

0 8,553

తిరుపతి ముచ్చట్లు:

 

అగ్రి గోల్డ్ భాధితులకు రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఏడు లక్షల పైగా భాధితులకు 666.84కోట్ల రూపాయలను జమ చేయడాన్ని హర్షిస్తూ బుధవారం ఉదయం బైరాగిపట్టెద లో వై ఎస్ ఆర్ టీ యు సీ కార్యాలయం వద్ద వై ఎస్ ఆర్ టీ యు సీ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి అడ్వర్యంలో అగ్రి గోల్డ్ బాధితులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగ రాజారెడ్డి మాట్లాడుతూ నేటి ముఖ్యమంత్రి ప్రతి పక్ష నాయకుడిగా ఉన్నపుడు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల కు ఇచ్చిన హామీలో బాగంగా 2019-20 బడ్జెట్ లో 1120కోట్ల రూపాయల కేటాయించి పది వేల లోపు దీపాజిట్ చేసిన వారికిలు 265కోట్లు జమ చేసారని, నేడు రెండో విడతలో బాగంగా 20వేల రూపాయల దీపాజిట్ చేసిన వారికి రెండు విదతల్లో సుమారు 10 లక్షల 45 వేల కుటుంబాలకు లభ్ది దీనిలో బాగంగా 905కోట్లు చెల్లిస్తున్నారని అందుకు అనుగుణంగా 666.84 కోట్ల రూపాయలను దీపాజిట్ల దారులకు జమ చేయడం జరిగిందని తెలిపారు. ప్రైవెట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ చూడలేదని పేద ప్రజల కోసం ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతగా తీసుకొందని మాట ఇస్తే మడమ తిప్పని జగన్ మోహన్ రెడ్డి కచి తత్వాన్ని ప్రజలు అర్తము చేసుకొని ఆయనకు ఎప్పుడు అండగా ఉండాలని ప్రజలను కోరారు. గత ప్రభుత్వం లో ఉన్నా మనుషుల కోసమే అగ్రి గోల్డ్ స్కాం జరిగిందని చంద్రబాబు అగ్రి గోల్డ్ యాజ మాన్యం తో కుమ్మక్కు అయిందని విమర్శిం చారు. ఈ కార్య క్రమంలో వై ఎస్ ఆర్ సీ పీ నాయకులు రపీ హిందుష్టాని, ఎన్. యశోద, అనిల్ రెడ్డి, బి. మురళి క్రిష్ణా అగ్రి గోల్డ్ బాధితులు నందిని, రాణి, అమ్ములు, పద్మజ, రేవతి, అనిత తడితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags: Agri Gold victims c. Yum. Anointing to paint

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page