టిటిడి స్థానిక ఆలయాల్లో ఆగస్టు 30న గోకులాష్టమి, 31న ఉట్లోత్సవం వేడుకలు

0 8,567

తిరుమల ముచ్చట్లు:

 

టీటీడీ స్థానిక ఆలయాల్లో ఆగస్టు 30 వ తేదీ సోమవారం గోకులాష్టమి, 31వ తేదీ మంగళవారం ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకలు ఆయా ఆలయాల్లో ఏకాంతంగా నిర్వహిస్తారు.

- Advertisement -

తిరుచానూరులో….

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఆగస్టు 30వ తేదీ ఉదయంశ్రీ కృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం,అర్చనలు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిష్టించి దర్శనమిస్తారు. త‌రువాతగోపూజ, గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వ‌హిస్తారు.
ఆగస్టు 31న స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

నారాయణవనంలో….

నారాయ‌ణ‌వ‌నం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 30న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం, శుద్ది నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు.ఆగష్టు 31వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం నిర్వ‌హిస్తారు. ఉద‌యం 8.30 నుండి 9.30 శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం, ఆల‌యంలో తిరుచ్చి ఉత్స‌వం, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆల‌యంలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.

నాగలాపురంలో….

నాగలాపురంశ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో 30 వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, శుద్ది నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు
శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన చేయనున్నారు.ఆగస్టు 31వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం జ‌రుపుతారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆల‌యంలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.

కార్వేటినగరంలో…..

కార్వేటినగరంశ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 30వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు, ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.ఆగస్టు 31వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుండి 7.30 గంటల వరకు గో పూజ మహోత్సవం, ఉట్లోత్సవం, ఆల‌యంలో నిర్వహించనున్నారు.

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags: Gokulashtami on August 30 and Utlotsavam on August 31 at TTD local temples

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page