కరుణానిధి సమాధి ప్రాంతంలో స్మారక మండపం

0 8,606

చెన్నై ముచ్చట్లు :

దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి ప్రాంతంలో రూ.39 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. కలైవానర్‌ అరంగం హాలులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఉదయం 110వ నిబంధనల కింద ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. స్టాలిన్‌ ప్రసంగిస్తూ.. మెరీనాబీచ్‌లో కరుణానిధి సమాధి ప్రాంతం వద్ద 2.2 ఎకరాల్లో స్మారక మండపాన్ని నిర్మించనున్నామని తెలిపారు. ఏడుదశాబ్ధాలపాటు పాత్రికేయుడిగా, ఐదు దశాబ్దాలపాటు డీఎంకే నేతగా, రాజకీయాల్లోనే కాకుండా చిత్ర రంగంలోనూ, సాహిత్య రంగంలో రాణించిన కరుణానిధికి స్మారకమండపం నిర్మించడం సముచితమన్నారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Memorial pavilion in the area of Karunanidhi Samadhi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page