కేంద్ర మంత్రి రాణె అరెస్టు

0 9,884

ముంబై ముచ్చట్లు :

 

సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అత్యవసర విచారణకు హైకోర్టు తిరస్కరించినా మహద్‌ కోర్టు ఆయనకు అర్ధరాత్రి బెయిల్‌ ఇచ్చింది. అనంతరం ఆయన విడుదల అయ్యారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా సీఎంకు తెలియదని, తాను ఆ సభలో ఉంటే చెంప పగలగొట్టేవాడినని రాణె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం సృష్టించాయి. దీంతో రాణెపై చర్యలు తీసుకోవాలని నాసిక్‌ పోలీసులకు శివసేన ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్‌ 500 (పరువునష్టం), 505(2) (హానికరం), 153-బీ(1)(సి) (విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా రత్నగిరి జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి రాణెను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆయన్ను సంగమేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేంద్ర మంత్రిని పోలీసులు అరెస్టు చేయడం 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags: Union Minister Rane arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page