కాబుల్ ఎయిర్‌పోర్టులో ప్లేటు భోజనం రూ.7,500

0 8,572

ఆఫ్ఘన్ ముచ్చట్లు :

 

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన తర్వాత అక్కడి పరిస్థితులు దిగజారాయి. ఆ దేశం నుంచి బయటపడేందుకు వివిధ దేశస్తులతో పాటు ఆఫ్ఘన్ ప్రజలు కూడా పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో కాబూల్ ఎయిర్ పోర్టుకు వేల మంది చేరుకున్నారు. ఏదో ఒక విమానంలో దేశం దాటేందుకు వారు యత్నిస్తున్నారు. మరోవైపు ఎయిర్ పోర్టు వద్ద తాగునీరు, ఆహారం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం అందక ఎంతోమంది సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఇదే అదనుగా భావించి, ఎయిర్ పోర్ట్ వెలుపల తాగునీరు, ఆహారాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఒక లీటర్ వాటర్ బాటిల్ ను 40 డాలర్లకు (దాదాపు రూ.3 వేలు), ఒక ప్లేట్ భోజనాన్ని 100 డాలర్లకు (దాదాపు రూ.7,500) విక్రయిస్తున్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: A plate meal at Kabul Airport costs Rs 7,500

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page