సోనూసూద్ ను కలిసేందుకు వృద్ధుడి సాహసం..

0 9,264

జగ్గంపేట ముచ్చట్లు :

 

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన 69 ఏళ్ల వృద్ధుడు బొండా సోమరాజు సాహసం చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్‌ను కలిసేందుకు స్కూటీపై ఏకంగా 1450 కిలోమీటర్లు ప్రయాణించారు. సోసూ సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడైన సోమరాజు ఎలాగైనా ఆయనను కలవాలన్న ఉద్దేశంతో స్కూటీపై ముంబై బయలుదేరారు. ఇంట్లో తెలిస్తే వెళ్లనివ్వరని భావించిన ఆయన పనిపై బయటకు వెళ్తున్నానని చెప్పి ఈ నెల 15న ఇంటి నుంచి స్కూటీపై ముంబై బయలుదేరారు. ప్రతి రోజూ 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఐదు రోజుల తర్వాత ఈ నెల 20న ముంబైలోని సోనూ సూద్ నివాసానికి చేరుకుని సోనూను కలిశారు. సోమరాజు మాట్లాడుతూ సోనూ సూద్ తనపై ఎంతో ప్రేమానురాగాలు చూపించారని అన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; An old man’s adventure to meet Sonu Sood .

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page