భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలి

0 35

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఖరారైన నేపధ్యంలో నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి వ్యక్తిగత సహాయకులు చంద్రహాస్‌ అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. బుధవారం చౌడేపల్లెలో పీఆర్‌ అధికారులతో సమీక్షించారు. ఎంపీడీఓ కాంప్లెక్‌ పనులను పరిశీలించారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సచివాలయం, ఆర్‌బికె, విఎల్‌ఎస్‌ పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవాలకు ముస్తాబుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ దామోదరరాజు, మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి, బూత్‌కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి,మిద్దింటి కిషోర్‌బాబు, ఎంపీడీఓ శంకరయ్య, పిఆర్‌ డిఈఈ మురళీధర్‌, తదితరులున్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Construction work should be completed quickly

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page