రూ:2 కోట్లతో బోయకొండలో గెస్ట్హౌస్‌ ఏర్పాటు-వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

0 8,628

-స్థలాన్ని పరిశీలించిన అధికారులు
– పార్కింగ్‌ స్థలాన్ని అభివృద్దికి చర్యలు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

పుణ్యక్షేత్రమైన బోయకొండ లో రూ:2 కోట్లు జిల్లా పరిషత్‌ నిధులతో గెస్ట్హౌస్‌ భవనం ఏర్పాటుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్‌రెడ్డి చొరవతో నిధులు మంజూరైనట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఆలయ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి బోయకొండలో పర్యటించారు. బోయకొండలో గెస్ట్ హౌస్‌ నిర్మాణం చేపట్టే స్థలాన్ని పరిశీలించారు. ప్లాన్‌ సిద్దం చేసిన తరువాత టెండర్‌ పిలిచి పనులు త్వరగా వెహోదలైయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే భక్తులు తీసుకొచ్చే వాహనాలకోసం కేటాయించిన పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు మార్గంతోపాటు వాహనాల భద్రత కోసం ప్రహరీ తోపాటు మౌళిక సదుపాయాల కల్పన కు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. కొండపై ఆలయం పరిసర ప్రాంతంలో గల ఎగుడు దిగుడుగా ఉన్న రాతి బండలను తొలగించి భక్తులకు సదుపాయం కల్పించేలా పనులు ప్రారంభించారు. మంత్రి పెద్దిరెడ్డి చొరవతో బోయకొండ ఆలయం వద్ద ఆహ్ల్రాదకరమైన వాతావరణంను తలపించేలా పార్క్, మౌళికవసతుల కల్పన పనులు చురుగ్గా జరుగుతున్నాయని, త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. వారి వెంట సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ రమేష్‌రెడ్డి, సదుం ఇమ్రాన్‌, ఈఓ చంద్రమౌళి, లడ్డూరమణ, పిఆర్‌ డిఈఈ మురళీధర్‌, ఏఈ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Establishment of a guest house in Boyakonda with Rs. 2 crore – YSSRCP State Secretary Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page