సాటి మనిషికి సహాయం చేయడం అనేది మన వృత్తీ ధర్మం- భూమన కరుణాకర్ రెడ్డి

0 8,549

తిరుపతి ముచ్చట్లు:

 

సాటి మనిషికి సహాయం చేయడం అనేది మన వృత్తీ ధర్మం భూమన కరుణాకర్ రెడ్డి ఉద్గాటన సాటి మనిషికి సహాయం చేయడమనేది మన వృత్తీ ధర్మ మని తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఉద్గాటించారు. గురువారం ఉదయం తిరుపతి ఎస్ వి యునివర్సిటి లోని సెనేట్ హాల్ నందు సంకల్ప సేవా సమితి, అంబేద్కర్ అధ్యయన కేంద్రం ల అడ్వర్యంలో మదర్ థెరిస్సా 111వ జయంతి వేడుకలు సంకల్ప సేవా సమితి అధ్యక్షులు ఎన్. రాజారెడ్డి అధ్యక్షతన జరిగింది. అంబేద్కర్ అధ్యయన కేంద్రం కన్వీనర్ బి. మురళీ క్రిష్ణా అథితులను వేదిక పైకి ఆహ్వానించారు. మదర్ థెరిస్సా చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో శాసన సభ్యులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సాటి మనిషికి సహాయం చేయడం అనేది ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, మనతో పాటు జీవించే వారిని పరి ర క్షిం చు కోక పొతే మనుషులకే జీవితం వ్యర్తమని అన్నారు. లక్ష లాది మంది సేవ చేశారు కాబట్టే కో విడ్ ను నియం త్రించ గలిగామని, మనం మనుషులం మన స్వార్తం మాత్రమే కాకుండా సాటి సమాజనీకి చేయూతను ఇవ్వాలని అన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఇబ్బందులు ఇలాంటి సమయంలో మనలో దాగి ఉన్న మానవత్వం బయటికి రావాలసిన అవసరం ఉందన్నారు. ప్రపంచములో కోవిడ్ బలపడి నప్పుడు తన ప్రాణాలకు లెక్క చేయకుండా ఎనలేని సేవ చేయడం పై వైద్యులకు ప్రపంచమే తల దించిందని అన్నారు. ఎవరు గుర్తించ వలసిన అవసరం లేకున్నా డాక్టర్లు చేసిన సేవలు అమోఘ మన్నారు.

 

 

- Advertisement -

కోవిడ్ లో మరణించిన వారికి అమానుసంగా ప్రవర్తించ కుండా అనేక మంది మదర్ థె రిస్సా కంటే తీసి పోకుండా సేవా చేసారని అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎం ఏ) నగర అధ్యక్షులు రాయపు రమేశ్ మాట్లాడుతూ మదర్ థెరిస్సా అంటే సేవ గుర్తుకు వస్తుందని తనను ఎందరు అవమాన పరచినా అసహ్యించు కోకుండా అవన్నీ వదిలి సేవకు అంకితమై న ధన్య జీవి యని అన్నారు. 14 సంవాస్త రాలు ఆమెతో కలిసి సేవ చేసిన భాగ్యం కలిగిందని అన్నారు. మదర్ థెరిస్సా మన మధ్య లేక పోయిన ఆమె చేసిన సేవలు చిరస్మర నీయ మన్నారు. తిరుపతి నగర మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డా. శిరీష మాట్లాడుతూ కరోన సమాయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయక ప్రజలకు సేవ చేసిన డాక్టర్లకు, నర్సులకు, వివిద సంస్థ ల వారికి గుర్తించి సన్మానం చేయడం వారికి మరింత ప్రోత్సహించి నట్లవు తుందని అన్నారు. స్విమ్ఎస్ డైరెక్టర్ డా. వెంగమ్మ్ మాట్లాడుతూ మదర్ థెరిస్సా పేరుతో కరోన వారి యర్స్ కు అవార్డ్ ఇవ్వడం గర్వించ దగ్గ విషయ మన్నారు. సభా నిర్వా కులు ఎన్. రాజా రెడ్డి, బి. మూరళీ క్రిష్ణా లు మాట్లాడుతూ కరోనలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి సేవ చేసిన వారికి ప్రోత్సహించడం వలన మరింత సేవ చేస్తారనే ఉద్దేశ్యం తో ఈ కార్య క్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.

 

 

అనంతరం తిరుపతి పరిసర ప్రాంతాలల్లో కరోన లో పని చేసిన ప్రభుత్వ ప్రైవేటు అసుపత్రులల్లో పనిచేసిన వైద్యులు, నర్సులు, ముస్లిం కరోన జె ఏ సీ, ప్రజా నేస్తం, ఆదార్ పౌండేషన్, మానవహక్కుల కౌన్సిల్, పత్రికల వారికి తదితర సంస్థల వారికి సన్మానం చేశారు. ఈ కార్య క్రమంలో తుడ కార్యదర్శి లక్ష్మి, ఎస్ వి యు రిజిష్టర్ డా. హుస్సేన్, శ్రీ పద్మావతి యూనివర్సిటీ రిజిష్టర్ డా. మమత, ఐ ఎం ఏ నగర అధ్యక్షులు డా. ఏ. జీవన్ బాబు, డా. రెడ్డిప, మానవ హక్కుల కౌన్ సిల్ నాయకులు రుయా కరోన ఇంచార్జ్ సుబ్బా రావు, ఎస్. బాల సుబ్రమణ్యం, ఆప్స్ నాయకులు రపీ హిందుష్టాని, ఆదార్ పౌండేషన్ షేక్ మహ్మద్ రపీ, సుబ్రమణ్యం రెడ్డి, మస్తానమ్మ, రాజేశ్, దేవా, ముస్లిమ్ జే ఏ సీ ఇమాం, గౌస్, మనీష్ గుప్త, శంకరయ్య, మహీం ద్ర, ఆనంద్, పెదరాయుడు తది తరులు పాల్గొన్నారు.

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Helping a fellow human being is our profession – Bhumana Karunakar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page