భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

0 8,608

చౌడేపల్లె ముచ్చట్లు:

 

భర్త వేధింపులు తాళలేక భార్య ఈశ్వరమ్మ(39) ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన సంఘటన గురువారం మండలంలోని ముదిరెడ్డిపల్లెలో చోటుచేసుకొంది. ఎస్‌ఐ రవికుమార్‌ కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. పందిళ్ళపల్లె పంచాయతీ ముదిరెడ్డి పల్లెకు చెందిన రమేష్‌తో చౌడేపల్లె మండలం దుర్గసముద్రం పంచాయతీ బండమీదపల్లెకు చెందిన ఈశ్వరమ్మకు ఇరవై యేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరి కుమారుడు సంపాధించిన సొమ్ముకోసం ప్రతిరోజు భార్య భర్తలిద్దరూ గొడవ పడేవారు. చెడు వ్యసనాలకు బానీసుడైన భర్త రమేష్‌ వేధింపులు అధికం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఈశ్వరమ్మ గ్రామానికిసమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. మృతురాలి తమ్ముడు చిన్నప్ప ఇచ్చిన ఫిర్యాధు మేరకు కేసు నమోదుచేసి శవాన్నిపోస్టు మార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; Husband abuses wife, commits suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page