అటవీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్చలకు హాజరు కాని నాయకులు

0 8,590

తిరుపతి ముచ్చట్లు:

 

టీటీడీ అటవీ కార్మికుల సమస్యలపై చర్చల కోసం టీటీడీ యాజమాన్యం గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశానికి సొసైటీల నాయకులు హాజరు కాలేదు.సమస్యల పరిష్కారం కోసం బుధవారం సొసైటీల నాయకులు ఆందోళనకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం సాయంత్రం 5-30 గంటలకు చర్చలకు రావాలని జెఈవో   సదా భార్గవి సొసైటీల నాయకులను ఆహ్వానించి సాయంత్రం 6 -30 గంటల వరకు వేచి చూశారు. తక్కువ వ్యవధిలో చర్చలకు ఆహ్వానించినందువల్ల తాము రాలేక పోయామని వారు సమాచారం పంపారు. దీంతో జెఈవో  సదా భార్గవి గురువారం సాయంత్రం 5.30 గంటలకు సమావేశానికి రావాలని వారికి సమాచారం పంపారు. ఈ మేరకు టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో ఏర్పాట్లు చేయించారు. అయితే సాయంత్రం 6-30 గంటల వరకు సొసైటీల నాయకులు సమావేశానికి హాజరు కాలేదు. సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు టీటీడీ యాజమాన్యం రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసినా సొసైటీ నాయకులు హాజరు కాలేదు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Leaders who do not attend negotiations for a solution to the problems of forest workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page