మరికాసేపట్లో పెళ్లి..వధువు పరారీ

0 8,615

మదనపల్లి ముచ్చట్లు :

 

మరికాసేపట్లో పెళ్లి పెట్టుకుని వధువు పరారైన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు (26)కి తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇక మంగళవారం రాత్రి వధూవరులకు నలుగుపెట్టారు. ఈ తంతు పూర్తయిన తర్వాత రాత్రికి రాత్రే కుటుంబ సభ్యుల కళ్లుగప్పి వధువు పరారైంది. విషయం తెలిసిన ఇరు కుటుంబాల సభ్యులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు, తనకు అవమానం జరిగిందంటూ వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారించగా వధువు మైనర్ అని తేలింది.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Married shortly after .. bride escapes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page