మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి

0 9,704

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండల పర్యటనను విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు రామమూర్తి సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28 వతేదీ శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చే సచివాలయభవనాలు, ఆర్‌బికెలు, విఎల్‌ఎస్‌ కేంద్రాలను ప్రారంబోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని ఏ.కొత్తకోట, దుర్గసముద్రం, చారాల,చింతమాకులపల్లె, పుదిపట్ల ,కాటిపేరి,కాగతి,చౌడేపల్లె,పరికిదొన గ్రామాల్లో ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమాలకు అందరూ హాజరై విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంలోపం, తాగునీటి లీకేజీల నివారణకు కృషిచేయాలన్నారు. అభివృద్ది పనులు త్వరగా పూర్తిచేసేలా అధికారులు, ప్రజాప్రతినిథులు చొరవతీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, డిఎల్‌పిఓ లక్ష్మి, ఎంపీడీఓ శంకరయ్య తదితరులున్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Minister Peddireddy should make the visit a success

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page