అమెరికాలో NRI యువతి దారుణ హత్య..

0 8,643

వాషింగ్టన్ ముచ్చట్లు :

భారత్‌కు చెందిన 24ఏళ్ల అర్పణా జినగా అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్ సీటీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న.. అర్పణాకు బైక్ రైడింగ్ అంటే ప్రాణం. 2008 అక్టోబర్‌ 31న అపార్ట్‌మెంట్ కాంపెక్ల్స్‌లో జరిగిన ఓ పార్టీలో.. సాధరణంగా బైక్ రైడర్లు ధరించే దుస్తులతో ఆమె తళుక్కుమంది. ఎంతో హుషారుగా పార్టీలో పాల్గొంది. అయితే అర్పణాకు అదే చివరి పార్టీగా మిగిలిపోయింది. 2008, నవంబర్ 1 తేదీ తెల్లవారు జామున అర్పణా ఘోరాతిఘోరంగా హత్యకు గురైంది. అక్టోబర్ 31 తర్వాత అర్పణా ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారుపడ్డారు. అమెరికాలో ఉంటున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కు సమాచారం ఇచ్చారు. ఓ ఫ్యామిలీ ఫ్రెండ్.. అర్పణా అపార్ట్‌మెంట్‌కు చేరుకోవడంతో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కుళ్లిన స్థితిలో ఉన్న అర్పణా మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. అర్పణా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి.. పోర్ట్‌మార్టం చేయించారు. అర్పణాపై అత్యాచారం జరిగినట్టు శవపరీక్షలో నిర్ధారణ అయింది. పోలీసులు.. ఇమ్మాన్యూయల్ ఫేర్ అనే వ్యక్తిని 2010లో అరెస్ట్ చేశారు. కోర్టు అతన్ని నిర్ధోషిగా తేల్చింది. అర్పణా హత్యకు గురై 13ఏళ్లు గడుస్తున్నా.. దోషి ఎవరన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags:NRI woman brutally murdered in America ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page