శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆలయ పాలకమండలి సమావేశం

0 10,055

— పాలకమండళి సమావేశంలో తీర్మాణం
–మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో అభివృధ్ది చేద్దాం
— భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద కొత్త హంగులతో తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేయాలని ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ స్పష్టం చేశారు. గురువారం చైర్మన్‌ అధ్యక్షతన బోయకొండ అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సమావేశంకు ముఖ్య ్య•ధిగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి హాజరైయ్యారు. ఈ సంధర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిల సహకారంతో కోట్లాది రూపాయాల నిధులతో అత్యంత సుందరంగా ఆలయం, పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. పనులు చురుగ్గా సాగుతున్నాయని,ఇ ంకనూ అవసరమైన పనులపై సమీక్షించారు. ఆలయానికి ఆధాయ వనరులు పెంచడానికి జంతు బలుల తలకాయలు, కొండ పైభాగానికి వెళ్ళడానికి వాహనాలకు టోల్‌ గేటు వసూలు, భక్తుల సెల్‌ఫోన్‌ భద్రపరుచుకోవడానికి లగేజీ బాక్స్ల నిర్వహణకు వేలం పెట్టాలని తీర్మాణించారు.దసరా మహ్గత్సవాలను ఘనంగా నిర్వహించి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను ఆహ్వానించడానికి ప్రతిపాదనలను తీర్మాణించి ఆమోదించారు.కొండ కింద గల కార్యాలయంను ఫంక్షన్‌ హాల్య్గా మార్పు , ఆటోలను కొండపైకి ఆలయం వద్దకు నిషేధించి వాటి స్థానంలో సుమోలు ఏర్పాటుకు తీర్మానించారు.పొంగల్‌ షెడ్లకు వంట పాత్రలు దేవస్థానం ద్వారా అతి తక్కువ ధరకు ఇవ్వాలని ఆమోదించారు. యాగశాల ఆశీర్వాదం మండపం ఏర్పాటు, దేవస్థానం వద్ద దేవతా వృక్షాలు ఏర్పాటు చేయుటకు కమీషనర్‌ అనుమతికి ఫైల్స్ పంపాలని సమావేశంలో ఆమోదించారు. ఈ సమావేశంలో ఈఓ చ ంద్రమౌళి, పాలకవర్గసభ్యులు వెంకటరమణారెడ్డి,శ్యామరాజు,రమేష్‌రెడ్డి, పూర్ణిమారాయల్‌ ,కనుగొండ ,స్వరూపరెడ్డి ,గంగిరెడ్డి,శ్రావణి,ఈశ్వరమ్మ నేతలు సోమల మల్లికార్జునరెడ్డి ,లడ్డూరమణ తదితరులున్నారు.

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Sri Boyakonda Gangamma Mother Temple Governing Body Meeting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page