తొమ్మిదినెలలలోపు చిన్నారులకు మూడుదశల వ్యాక్సిన్‌ తప్పనిసరి

0 9,694

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుట్టిన శిశువు నుంచి తొమ్మిదినెలలలోపు గల చిన్నారులకు మూడుదశల పిసివి వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించుకోవాలని వైద్యాధికారి పవన్‌కుమార్‌ సూచించారు. బుధవారం చౌడేపల్లె సచివాలయంలో న్యుమోనియా వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. ఈ సంధర్భంగా డాక్టర్‌ మాట్లాడుతూ పీసీవి వ్యాక్సిన్‌ 6 వారాలకు తొలిడోసు,14 వారాలకు రెండవ డోసు,తరువాత 9 నెలల వయస్సులో మూడవ డోసు వేసుకోవాలని, చిన్నారులకు నిమోనియా వ్యాధి నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఒకొక్క డోసు ఖరీధు రూ:3500 ల చొప్పున ప్రభుత్వం విక్రయించి ప్రజలకు ఉచితంగా అందిస్తోందని ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లితండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల పార్టీ కన్వీనర్‌ రామ్మూర్తి, మాజీ జెడ్పిటీసీ రుక్మిణమ్మ, సర్పంచ్‌ వరుణ్‌భరత్‌,ఎంపీడీఓ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

రూ:2 కోట్లతో బోయకొండలో గెస్ట్హౌస్‌ ఏర్పాటు-వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

Tags; Three-stage vaccination is mandatory for infants under nine months of age

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page