పుంగనూరులో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు గడపగడపకు -చైర్మన్‌ అలీమ్‌బాషా

0 9,769

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలోని ప్రజలందరిని చైతన్యవంతులను చేసి నవరత్నాల గురించి వివరించేందుకే గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. శుక్రవారం పట్టణంలోని అన్ని వార్డుల్లోను ఆయా వార్డు కౌన్సిలర్లు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలసి గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ఇంటింటికి వెళ్లి నవరత్నాలు గురించి వివరించి, కుటుంభాల వారిగా అందుతున్న సంక్షేమ పథకాల వివరాల జాబితాలను అందించారు. అలాగే ప్రజల సమస్యలు గుర్తిస్తున్నామన్నారు. అర్హులైన పేదలందరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాలని మంత్రి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ పర్యటనలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సిఆర్‌.లలిత, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, రేష్మా, అర్షద్‌అలి, తుంగామంజునాథ్‌, భారతి, మమత, పూలత్యాగరాజు, రాఘవేంద్ర, కాళిదాస్‌, కమలమ్మ , నయీంతాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; Gadapagadapaku -Chairman Aleem Basha to motivate the people in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page