కర్నూలులో హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయం..

0 7,595

కర్నూలు ముచ్చట్లు :

ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్‌సీ) ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు కానుంది. 2017లో అమరావతి కేంద్రంగా హెచ్ఆర్‌సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా హెచ్ఆర్‌సీ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ గెజిట్ విడుదల చేసింది. హెచ్ఆర్‌సీ కార్యాలయ మార్పు విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై నిన్న జరిగిన విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ.. కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం కూడా ఆమోదించిందని తెలిపారు. హెచ్‌ఆర్‌సీ చైర్మన్, సభ్యులు కర్నూలులో రెండు ప్రాంగణాలను పరిశీలించారని, అయితే అవి అనుకూలంగా లేకపోవడంతో మరోటి పరిశీలనలో ఉందని తెలిపారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:HRC Headquarters in Kurnool.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page