శ్రీ వేణుగోపాల‌స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన మహాసంప్రోక్షణ

0 8,597

తిరుపతి ముచ్చట్లు:

 

కార్వేటిన‌గ‌రంశ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధ‌రణ మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా ముగిసింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.ఆలయంలో ఐదు రోజుల పాటు అష్టబంధన జీర్ణోద్ధ‌రణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. చివ‌రి రోజైన శుక్ర‌వారం ఉద‌యం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు హోమాలు, ఉద‌యం 7.30 గంట‌ల‌కు మ‌హా పూర్ణాహూతి నిర్వ‌హించారు. ఉద‌యం 8 నుండి 8.20 గంట‌ల మ‌ధ్య క‌న్యాల‌గ్నంలో శ్రీ వేణుగోపాల‌ స్వామి, ప‌రివార దేవ‌త‌ల‌కు కుంభార్చన, మ‌హా సంప్రోక్ష‌ణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జ‌రిగాయి. ఉద‌యం 10.30 గంట‌ల నుండి భక్తులను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు.సాయంత్రం 4.30 నుండి
6 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు క‌ల్యాణోత్స‌వం, రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఊరేగింపు నిర్వ‌హిస్తారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పార్వ‌తి, ఆగ‌మ స‌ల‌హాదారు  వేదాంతం విష్ణుభ‌ట్టాచార్య‌, ఏఈవో దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్  ర‌మేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  కుమార్, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీవారి హుండీ ఆదాయం 1.88 కోట్లు

Tags: Mahasamprakshana which ended scientifically at Sri Venugopalaswamy Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page