సాధారణ కూలీకి రూ. లక్షకు పైగా కరెంట్ బిల్లు

0 8,564

అనంతపురం ముచ్చట్లు :

అతడో సాధారణ కూలీ. రోజూ పనికెళ్తే తప్ప పూట గడవదు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ చేదోడుగా ఉంటోంది. ఇంట్లో ఓ టీవీ.. ఫ్యాన్.. మూడు కరెంట్ బల్బులు తప్ప ఇంకేమీ లేవు. అంతటి పేదోడికి పెద్ద షాకే తగిలింది. కరెంటోళ్లు ఇచ్చిన బిల్లు చూసి గుండె గుభేల్ మంది. రూ.లక్షకుపైనే బిల్లు వచ్చింది. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప అనే వ్యక్తికి ఎదురైంది. నెలనెలా రూ.200 నుంచి రూ.300 దాకా వచ్చే కరెంట్ బిల్లు.. ఇటీవల ఏకంగా రూ.1,48,371 వచ్చింది. ఆ బిల్లు చూసిన పర్వతప్ప కలవరపాటుకు గురయ్యాడు. విద్యుత్ సిబ్బందిని పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. బిల్లును రూ.56,399కు తగ్గించారు. అంత బిల్లు కట్టలేమని పర్వతప్ప మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Rs. Current bill over Rs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page