ఐదుగురు బాలికలపై లైంగికదాడి చేసిన టీచర్ కు 21 ఏళ్ల జైలు

0 8,632

కొత్తగూడెం ముచ్చట్లు :

 

కరోనా కారణంగా పాఠశాలలు మూతపడినప్పటికీ క్లాసుల పేరుతో బాలికలను పాఠశాలకు రప్పించి అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడికి కోర్టు 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో దొడ్డా సునీల్‌కుమార్ (40) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో గతేడాది పాఠశాలలు మూతపడినప్పటికీ సునీల్ కుమార్ మాత్రం కొందరు బాలికలను పాఠాల పేరుతో స్కూలుకు రప్పించేవాడు. ఈ క్రమంలో అతడు వారిపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాధిత బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది డిసెంబరు 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా నిన్న ఈ కేసును విచారించిన కొత్తగూడెంలోని పోక్సో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ నిందితుడు సునీల్ కుమార్‌ను దోషిగా తేల్చి శిక్ష విధించారు. 21 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 11 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

 

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: 21-year-old jailed for teacher who sexually assaults five girls

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page