దండికుప్పంలో ఏనుగుల హల్ చల్

0 7,210

చిత్తూరు  ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా వి.కోట మండలం దండికుప్పంలో పంటపొలాలపై ఏనుగుల స్వైరవిహారం చేసాయి. 22 ఏనుగుల గుంపు అడవి నుండి వరి పైరులోకి చొరపడింది. దాంతో పది ఎకరాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఆటవీశాఖ, రెవిన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. రాత్రి 8 గంటలు దాటాక పొలాల్లో ఏనుగులు కనిపించడంతో రైతులు భయంతో వాటిని దారి మళ్ళించేందుకు ప్రయత్నించారు. రాత్రి చీకట్లో వర్షం హోరున కురవడంతో వాటిని దారి మళ్ళించ లేక అవి తిరగబడటంతో చేసేది లేక రైతులు నిస్సహాహులుగా వెనుతిరిగారు. దీంతో ఏనుగులు సుబ్రమణ్యం, కుమార్.. మహమ్మద్.. అనే రైతులకు చెందిన వరిపైరుతో పాటు పశుగ్రాసం, రాగి పైరు ఇతర పంటలన్నీ పూర్తిగా నాశనం చేసాయి. గత నెలరోజులుగా ఏనుగులు తరచూ పంట పొలాల్లోనికి వస్తుండటంతో వాటిని దారి మళ్ళించ మని అటవీ అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుగున్న ఏనుగులు గుంపులో ఉండటంతో అవి తిరగబడుతూ.. ఘీకరిస్తున్నాయి. రాత్రి వానలో గజరాజులు.. బావిలో దిగి జలకాలాడి సేదతీరాయి. బావి చుట్టూ పొలంలో ఏనుగులు బురదలో ఆటలాడుకున్నాయి..

 

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

- Advertisement -

Tags:Elephant hull chal in dandikuppam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page