తమ్ముడికి నిశ్చితార్థం జరిగిన అమ్మాయితో అన్న ఎస్కేప్..

0 8,786

రాజస్థాన్‌ ముచ్చట్లు:

– కుటుంబ సభ్యులకు పంపిన సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడంటే.
అప్పటికే అతడికి వివాహం జరిగింది.. అతడి చిన్న తమ్ముడికి తాజాగా పెళ్లి కుదిరింది.. నిశ్చితార్థం కూడా అయిపోయింది.. వివాహ సమయం దగ్గరపడుతోందనగా అతడు తన కుటుంబానికి షాకిచ్చాడు.. తన భార్యను వదిలేసి తమ్ముడికి కాబోయే భార్యతో సహా పరారయ్యాడు.. దీంతో ఇరు కుటుంబాల పెద్దలూ వారి గురించి వెతకడం ప్రారంభించారు.. ఈ నేపథ్యంలో అతడు తన కుటుంబ సభ్యులకు ఓ వీడియో పంపాడు.. తమ గురించి వెతకవద్దని చెప్పాడు.. రాజస్థాన్‌లోని బుండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

ఈ నెల మూడో తేదీన రాజేష్ అనే యువకుడు, అతడి తమ్ముడికి కాబోయే భార్య అదృశ్యమయ్యారు. ఆమె మైనర్ బాలిక కావడం గమనార్హం. అప్పటికే వివాహితుడైన రాజేష్ తన చిన్న తమ్ముడికి కాబోయే భార్యతో ప్రేమలో పడ్డాడు. దీంతో వారిద్దరూ ఈ నెల మూడో తేదీన పరారయ్యారు. దీంతో బాలిక తండ్రి తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు ఇరు కుటుంబాల వారు, మరోవైపు పోలీసులు ఆ ఇద్దరి గురించి వెతుకుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆ ఇద్దరూ ఓ వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించారు. `మేమిద్దరం ప్రేమించుకున్నాం. కలిసి బతకాలనుకుంటున్నాం. అది సాధ్యం కాదని తెలుస్తోంది. కలిసి బతకలేకపోతే కలిసి చనిపోతాం. మా గురించి వెతకొద్దు. ఒకవేళ మీకు దొరికితే మా మృతదేహాలే దొరుకుతాయి. అప్పుడు అంత్యక్రియలు చేయించండ`ని ఆ వీడియోలో ఇద్దరూ పేర్కొన్నారు. పోలీసులు ఈ వీడియోను పరిశీలిస్తున్నారు.

 

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Escape with a girl who is engaged to her younger brother ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page