30న ఎస్వీ గోశాలలో గోకులాష్టమి ‘గోపూజ’

0 3

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఆగ‌స్టు 30న సోమవారం గోకులాష్టమి గోపూజ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్రమం నిర్వహిస్తారు.ఇందులో భాగంగా ఉదయం 10.30 గంటలకు ‘గోపూజ మహోత్సవం’ జరుగనుంది. ఆ తరువాత శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో పూజ, హారతి ఇస్తారు.భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. గోపూజ‌ వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని భ‌క్తుల నమ్మకం. ఈ సంద‌ర్భంగా గోవుల‌ను ప్ర‌త్యేకంగా అలంక‌రించి అర్చ‌కులు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Gokulashtami ‘Gopuja’ on 30th at SV Goshala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page