రైతుల చెంతకు ప్రభుత్వ సేవలు – మంత్రి పెద్దిరెడ్డి

0 8,689

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్రంలోని రైతులను అన్ని విధాల ఆదుకుని , వారినిఅభివృద్ధి చేసేందుకు వారి చెంతకు సేవలందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టి, నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని కురప్పల్లె, ఎంసి.పల్లె, పాళ్యెంపల్లె, బండ్లపల్లె గ్రామాల్లో ఆర్‌బికెలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్‌బికెలలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా భూసార పరిరక్షణ చేపట్టడం నిర్వహించి, అనువైన పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తూ, ఎరువులు, మందులు ఆర్‌బికెలలో నిల్వ ఉంచుతున్నట్లు తెలిపారు. అలాగే రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, పనిముట్లను వినియోగించుకునేందుకు కమిటిల ద్వారా ఆర్‌బికెలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాడి రైతుల కోసం ప్రత్యేకమైన పథకాలు ఏర్పాటు చేసి, పశు సంరక్షణ కోసం ఆవులకు, గొర్రెలకు భీమా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు పండించిన పంటలను ఈక్రాప్‌లో నమోదు చేసి, భీమా సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రైతు భరోసా పథకం క్రింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, ముడా చైర్మన్‌ వెంకటరె డ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీఎంపిపి నరసింహులు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి , పార్టీ నాయకులు చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, ఈశ్వర్‌రెడ్డి, ధనుంజయరెడ్డితో పాటు అన్నిశాఖల అధికారులు , సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Government Services for Farmers – Minister Peddireddy

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page