రేపు మోత్కుపల్లి నరసింహులు దీక్ష

0 9,677

తెలంగాణ ముచ్చట్లు :

 

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం ఒక రోజు దీక్షకు దిగనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ దీక్షను చేపట్టనున్నట్టు నర్సింహులు చెప్పారు. కొన్ని రోజులుగా రేవంత్ తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. దళితుల సాధికారత కోసం సభలు, సమావేశాలను నిర్వహించడం, గిరిజన ఆత్మగౌరవ దీక్షలను నిర్వహించడం వంటివి చేస్తుండటం తనకు విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు. పుట్టుకతోనే దొరల వంశానికి చెందిన రేవంత్ రెడ్డి ఆయన స్వగ్రామంలో దళితుల మధ్య భోజనాలు, నిద్రలు చేయగలరా? అని ప్రశ్నించారు. 70 ఏళ్లలో ఎంత మంది దళితులు ఆయన ఇంటి ముందు చెప్పులు వేసుకొని నడిచారో రేవంత్ చెప్పగలరా? అని అడిగారు. రేవంత్ వైఖరిని నిరసిస్తూ రేపు ఆదివారం నాడు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్షను చేపట్టనున్నానని చెప్పారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

 

Tags; Motkupalli Narasimha will be inaugurated tomorrow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page