ప్రతి పల్లెకు ఆర్టీసీసేవలు

0 8,615

చౌడేపల్లె ముచ్చట్లు:

 

రోడ్డుమార్గం ఉన్న ప్రతి పల్లె కూ ఆర్టీసీ సేవలందిస్తామని పుంగనూరు డిపోమేనేజరు సుధాకరయ్య తెలిపారు. శనివారం ఆయన చౌడేపల్లెలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలమేరకు నియోజకవర్గంలో ప్రతి పల్లెకూ రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చౌడేపల్లె నుంచి బోయకొండ మీదుగా మదనపల్లెకు తక్కువ చార్జీతో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు.అలాగే పుంగనూరునుంచి మేటి మంద మీదుగా కందూరు, కలికిరి, రాయచోటి వరకు ప్రత్యేక సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సర్వే చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియర్‌ కార్యదర్శి కరీముల్లా, ఏడిసీ యల్లయ్యు, కోశాధికారి మల్లేశ్వర్‌,ఏఎన్‌ఎల్‌ ఏజెంట్‌ ఎల్‌.నాగరాజ లు పాల్గొన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; RTC services to every village

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page