రాజ్యాధికారం బి సి ల హక్కు

0 8,602

తిరుపతి ముచ్చట్లు:

 

దేశంలో రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి బి సి పోరాడాలని, అఖిల భారత బి సి సమాక్య జాతీయ అధ్యక్షులు సత్యవాడ శ్రీనివాస్ అన్నారు. శనివారం తిరుపతిలోని ఆ సంస్థ కార్యాలయంలో, తిరుపతి   అధ్యక్షులు లంకిపల్లి శ్యామూర్తి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కువ శాతం జనాభా కలిగిన బి సి లు, నానాటికి అనగతోక్కబడుతున్నారని, అలాంటి వారి జీవితాలు మారాలంటే, ప్రస్తుతంఉన్న పరిస్థితుల్లో రాజ్యాధికారమే ముఖ్యమని, అది బి సి ల హక్కు అని అన్నారు. అనంతరం శ్యామూర్తి మాట్లాడుతూ…. క్షేత్ర స్థాయిలో బి సి ల హక్కులను కాపాడుకుంటూ, ప్రతిఒక్కరు అభివృద్ధి చెందేలా పోరాటాలకి సిద్దంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్ణ చైతన్య, పొన్నా రవికుమార్, వెంకటేష్, తులసి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Sovereignty is the right of the BCs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page