వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం… ఏపీకి వర్ష సూచన

0 8,597

అమరావతి ముచ్చట్లు :

 

పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్టు తెలిపింది. ఈ క్రమంలో నేడు వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇవాళ తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ…. రేపు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Surface Periodicity in Northwestern Bay of Bengal … Rain Forecast for AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page