చంచల్​ గూడ జైలుకు తీన్మార్​ మల్లన్న

0 9,869

హైదరాబాద్ ముచ్చట్లు :

 

చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కు సికింద్రాబాద్ సివిల్ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది. డబ్బుల కోసం తనను బెదిరించాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న ఆయన్ను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ ఆయన్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తమకు వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే, మల్లన్నపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆయన తరఫు లాయర్ ఉమేశ్ చంద్ర కోర్టుకు తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిచలేదన్నారు. ఇటు తీన్మార్ మల్లన్న కూడా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందరి వాదనలను విన్న కోర్టు.. మల్లన్నకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Teenmar Mallanna to Chanchalguda Jail

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page