ప్రజల చెంతకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

0 8,655

– సీఎం ఆశయ సాధనకోసం సిబ్బంది పనిచేయాలి
– భవనాల ప్రారంభోత్సంలో మంత్రి పెద్దిరెడ్డి
– అర్హులందరికీ పథకాలు అందాలి

 

చౌడేపలెముచ్చట్లు:

 

- Advertisement -

అర్హత ఉన్న ప్రతి కుటుంభానికి వారి చెంతకు సంక్షేమ పథకాలను అందించడమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని మంత్రివర్యులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. శనివారం తంబళ్లపల్లె,చిత్తూరు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, శ్రీనివాసులు , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డితో కలిసి మండలంలోని ఏ.కొత్తకోట,దుర్గసముద్రం, చారాల, 29 ఏచింతమాకులపల్లె, పుదిపట్ల, కాటిపేరి, కాగతి, చౌడేపల్లె, పరికిదొన గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సచివాలయాలు, ఆర్‌ బికేలు,విఎల్‌ఎస్‌ భవనాలను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు.పేదలకు సకాలంలో ప్రభుత్వ సేవలందించడానికి ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ ప్రపంచానికే తలమానీకంగా నిలచిందని కొనియాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశయ సాధన కోసం గ్రామీణ సచివాలయ సిబ్బంది సమిష్టిగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరుతేవాలని కొనియాడారు.ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో అర్హత ఉన్న ప్రతి లబ్దిదారుడికీ లబ్దిచేకూరాలని సూచించారు. అనంతరం జగన న్న పచ్చతోరణం లో భాగంగా వెహోక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్‌,ఏఐపీపీ మెంబరు అంజిబాబు, జెడ్పిటీసీ దామోదరరాజు,బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ,మాజీ ఎంపీపీ రెడ్డిప్రకాష్‌, రుక్మిణమ్మ, మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి,బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి,సర్పంచ్‌లు రిజ్వానా,వరుణ్‌భరత్‌, విజయకుమారి ,హైమావతి, సుజాత, సరితారెడ్డి,ష్రంషీర్‌,లక్ష్మిదేవి ఎంపీటీసీలు నాగరత్న, మునెమ్మ,నరసింహులు యాదవ్‌,శ్రీరాములు ఎంపీడీఓ శంకరయ్య,ఏపిడీ శ్రీనివాసులు, తహసీల్దార్‌ మాధవరాజు,తదితరులుపాల్గొన్నారు.

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: The aim of the government is to provide welfare schemes to the people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page