తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

0 8,600

తిరుపతి ముచ్చట్లు:

 

వైఎస్ఆర్‌ కడప జిల్లా తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు శ‌నివారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మ‌య్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు.ఇందులో భాగంగా శ‌నివారం సాయంత్రం 6 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మత్సంగ్రహణం, వాస్తు హోమము, అంకురార్పణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.ఆగస్టు 29న ఉద‌యం 8 గంట‌ల‌కు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, గ్రంధి ప‌విత్ర పూజ జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 30న నిత్యపూజ, నిత్య హోమం, గ్రంధి పవిత్ర స‌మ‌ర్ప‌ణ‌, పూర్ణాహుతి, పవిత్ర వితరణ, సాయంత్రం 5.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆల‌యంలో ఏకాంత‌గా ఊరేగిస్తారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: The holy festival begins at the temple of Sri Siddheswaraswamy in Thallapaka

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page