డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లీ అరెస్ట్

0 9,930

ముంబాయి ముచ్చట్లు :

 

డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లీ అరెస్ట‌య్యాడు. నిన్న‌ డ్రగ్స్‌ సరఫరదారుడు అజయ్‌ రాజు సింగ్ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులకు చిక్కడంతో అత‌డిని పోలీసులు విచారించారు. లభించిన ప్రాథమిక ఆధారాలతో అర్మాన్‌ కోహ్లీ ఇంటిపై నిన్న అధికారులు దాడి చేయ‌డంతో అక్కడ కొకైన్ లభ్య‌మైంది. దీంతో అర్మాన్‌ కోహ్లీని కూడా ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ రోజు ఆయ‌న‌ను అరెస్టు చేశారు. కాసేప‌ట్లో కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో సినిమాలో అర్మాన్ న‌టించి గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీ బిగ్‌ బాస్‌లోనూ అర్మాన్‌ కోహ్లీ పాల్గొన్నాడు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Bollywood actor Armaan Kohli arrested in drugs case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page