సదుం మండలం లో టీడీపీకి చావుదెబ్బ

0 8,327

-200 మంది మంత్రి సమక్షంలో వైసీపీలో చేరిక

సదుం ముచ్చట్లు:

- Advertisement -

చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా సదుం మండలంలో టీడీపీకి గట్టి చావు దెబ్బ తగిలింది. మండలంలోని పాల మంద పంచాయతీకి చెందిన టిడిపి సీనియర్ నాయకులు విశ్వనాథరెడ్డి రంగారెడ్డి తమ 200 మంది అనుచరులతో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రంగారెడ్డి, విశ్వనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆద్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో అందరికీ అందుతున్నాయని అందుకోసమే మంత్రి సమక పార్టీలో చేరతున్నామని అన్నారు. వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే మంత్రి గ్రామ సచివాలయం నూతన భవనాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి జడ్పిటిసి సోమశేఖర్ రెడ్డి నాయకులు మనోహర్ రెడ్డి, ఎల్లప్ప , రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags:Death toll for TDP in Sadum zone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page