పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం..

0 7,581

టోక్యో ముచ్చట్లు :

జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సొంతమైంది. అద్వితీయ పోరుతో నిన్న ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజతం రూపంలో దేశానికి తొలి పతకం అందించింది. మహిళల సింగిల్స్ క్లాస్ 4‌ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి ఝౌ యింగ్‌తో ఈ ఉదయం జరిగిన పోరులో భవీనాబెన్ పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. ఫలితంగా, టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులెక్కింది. మొన్న బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్‌లో 3-0తో అద్వితీయ విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన భవీనాబెన్.. ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. నిన్న చైనాకు చెందిన మియావో జాంగ్‌‌తో జరిగిన సెమీఫైనల్‌లో 3-2తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా నిన్ననే భారత్‌కు తొలి పతకం నమోదైంది.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:India’s first medal at the Paralympics.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page