సీఎం జ‌గ‌న్ కు పాలాభిషేకం చేసిన లేడీ కండక్టర్

0 9,867

అమరావతి ముచ్చట్లు :

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులంద‌రికీ కార్పొరేట్ బీమా సౌకర్యం కల్పించింది. ఇందుకోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ప్రమాదవశాత్తు ఉద్యోగి మృతి చెందితే 40 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. శాశ్వత వికలాంగులైతే 30 లక్షలు, సహజ మరణానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యా రుణాలు, ఆడ పిల్లల వివాహ రుణాల మాఫీ కూడా కల్పించనున్నారు. ఈ బీమా కోసం ఉద్యోగి నెలకు రూ.200 బీమా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఆర్టీసీ ఉద్యోగులను ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా, ఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందంలో ఉన్నారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతూ మ‌హిళా కండ‌ర్ట‌ర్ జ‌గ‌న్ పోస్ట‌ర్ కు పాలాభిషేకం చేశారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags:Lady conductor anointed to CM Jagan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page