పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

0 8,824

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గంలో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సును నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ ఆర్టీసి ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి ఏర్పాటు చేసిన నూతన బస్సు సర్వీసులను చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డితో కలసి మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆర్టీసి డిపోను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పుంగనూరు డిపో నుంచి ప్రస్తుతం 75 సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఆర్టీసిని వినియోగించుకుని, సురక్షిత ప్రయాణాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌చైర్మన్లు నాగేంద్ర, లలిత, డిఎం సుధాకరయ్య, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నాగరాజారె డ్డి, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; RTC bus to every village on the road in Punganur- Minister Dr. Peddireddy Ramachandrareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page