గ్రామీణాభివృద్ధి కోసం సర్పంచ్‌లు సైనికులవలె పనిచేయాలి- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

0 9,884

-సచివాలయాల ద్వారా అర్హులందరికి సంక్షేమ పథకాలు
-మహిళల స్థానంలో ఇతరులకు చోటు ఇవ్వకండి
-కష్టపడేవారందరికి తగిన ప్రాధాన్యత

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో సర్పంచ్‌లు సైనికులవలె పనిచేసి, ప్రజలకు సేవలందించి, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పుంగనూరులో నియోజకవర్గ స్థాయి సర్పంచ్‌ల సమావేశాన్ని మంత్రి జ్యోతి వెలిగించి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, జేసి వీరబ్రహ్మం, సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో దశరథరామిరెడ్డి తో కలసి మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టి, సచివాలయ వ్యవస్థను నెలకొల్పారని కొనియాడారు. ప్రతి సచివాలయ పరిధిలోను సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు సుమారు 50 మందికి తక్కువ లేకుండ ఉంటారని , వీరితో పాటు సర్పంచ్‌లు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు ఉంటారని అందరు కలసి ఒకొక్కరోజు ఒకొక్క గ్రామంలో పర్యటించిన ప్రజల సమస్యలను గుర్తించి, ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలౌతుందన్నారు. అలాగే కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికి సచివాలయం ద్వారా సంక్షేమ పథకాలు అందించడం చేయాలన్నారు. అర్హులకు పథకాలు అందకపోతే వాటికి గల కారణాలు గుర్తించి, చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సర్పంచ్‌లకు ఎదురైయ్యే సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తక్షణం తీసుకురావాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచ్‌ పదవి ఎంతో ఉన్నతమైనదని కొనియాడారు. ప్రతి ఒక్కరికి నవరత్నాలు గురించి వివరించి, నవరత్నాలను అందించాలని కోరారు. ఎంపి రెడ్డెప్ప, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, జేసి వీరబ్రహ్మం, సర్పంచ్‌ల విధులు, అధికారాలు, వివరించారు. ఈ సమావేశంలో జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మదనపల్లె అర్భన్‌ డెవలెప్‌మెంట్‌ ఆథారిటి చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏకిల సంఘ కార్పోరేషన్‌ చైర్మన్‌ మురళిధర్‌, మొదలియార్ల కార్పోరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్‌, వైఎస్‌ఆర్‌సీపి రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు 50 శాతం…

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లోను మహిళలకు 50 శాతం పదవులు కేటాయించి, గుర్తింపు ఇచ్చారని కొనియాడారు. మహిళలు తమ ప్రాంతాల్లో నిత్యం పర్యటించాలన్నారు. మహిళల స్థానాల్లో భర్తలు, కుటుంబ సభ్యులు తిరగవద్దన్నారు. మహిళలకు కేటాయించిన పదవులకు వారి ద్వారా సేవలు అందించాలన్నారు.

క్లాప్‌ను విజయవంతం చేయాలి…

ముఖ్యమంత్రి ప్రారంభించనున్న క్లాప్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని , వందరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. దీని ద్వారా ప్రతి గ్రామంలోను చెత్తను తొలగించడం జరుగుతుందన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు డంప్పింగ్‌ యార్డులకు తరలించి, హానికారికచెత్తను వేరుచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆచెత్తను తీసి సేంద్రియ ఎరువులు తయారు చేసి, రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. వాహనాలు అందించడం జరుగుతోందన్నారు. దీని ద్వారా గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

జగనన్న పచ్చతోరణం….

జగనన్న పచ్చతోరణం క్రింద నిర్ణయించిన మేరకు ఆగస్టు నెలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపులా , ఉపాధిహామి పథకం క్రింద మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. వీటి సంరక్షణను సర్పంచ్‌లకు కేటాయించడం జరిగిందన్నారు. మొక్కలకు నీటిని సరఫరా చేసేందుకు ఒకొక్క పంచాయతీకి ఒకొక్క ట్రాక్టర్‌ను అందజేసి, జగనన్న పచ్చతోరణం క్రింద పచ్చదనాన్ని పెంపొందించడం జరిగిందన్నారు.

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Sarpanches should act like soldiers for rural development: Minister Dr. Peddireddy Ramachandrareddy

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page