ఆన్‌లైన్‌ క్లాసులు పక్కనపెట్టి నగ్న వీడియోలు చూసింది..!

0 5,702

అహ్మదాబాద్‌ ముచ్చట్లు :

ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ఇప్పుడు పిల్లలకు విధిగా ఓ ఫోన్‌ ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఆ పిల్లలు ఆ ఫోన్లను దుర్వినియోగం చేస్తూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తలనొప్పి తీసుకువస్తున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన బాలిక (15)కు తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కొన్నిరోజుల కిందట స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చారు. అప్పటి నుంచి బాలిక ఆన్‌లైన్‌ క్లాసులు వింటోంది. ఇటీవల తల్లిదండ్రులకు తమ కుమార్తె నగ్న వీడియో కనిపించింది. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. బంధువుల సహాయంతో వారు ఆస్పత్రిలో చేరారు. అనంతరం బాలికను వీడియో గురించి ఆరా తీయగా విస్తుగొల్పే విషయాలు తెలిపింది. గదిలో ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న సమయంలో ఆమెకు ఓ వైబ్‌సైట్‌ కనిపించింది. అది తెరచి చూడగా మొత్తం నగ్న వీడియోలు, చిత్రాలు ఉన్నాయి. వాటిని చూడడం ప్రారంభించిన బాలిక వాటికి కామెంట్లు కూడా చేయడం మొదలుపెట్టింది. ఆన్‌లైన్‌లో కొందరితో పరిచయమైంది. వారు బాలికకు నీ వీడియో కూడా పెట్టు అని బలవంతం చేస్తున్నారు. తరచూ అడుగుతుండడంతో ఒకరోజు బాలిక తన నగ్న వీడియో, ఫొటోలను ఆ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. ఆ వీడియోకు స్పందన బాగా వచ్చింది. దీంతోపాటు తమ బంధువుల పిల్లలకు కూడా ఆ వెబ్‌సైట్‌ను ఫాలో కావాలని.. మీరు కూడా ఫొటోలు, వీడియోలు పంచుకోవాలని చెప్పింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చీవాట్లు పెట్టి ఈ బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. దీనిపై 181 కు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలికకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తొలగించేశారు. ఆ వెబ్‌సైట్‌ వివరాలు తెలుసుకుంటున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:I put aside online classes and watched nude videos ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page