తిరుమలలో కాళీయమర్ధన చిన్నికృష్ణుడికి విశేష అభిషేకం

0 9,862

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమలలో సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వ‌ర్యంలో ఘనంగా నిర్వహించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఏకాంతంగా ప్రత్యేక అభిషేకం, ఉట్లోత్సవం జరిగాయి.           గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన చిన్నికృష్ణునికి  ఉదయం 11 గంట‌ల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, కుంకుమ‌, చంద‌నం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది.ఈ కార్యక్రమంలో ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్  శ్రీనివాస్‌, విజిఓ  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Kaliyamardhana in Thirumala is a special anointing for Chinnikrishna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page