కాబూల్ విమానాశ్ర‌యం వ‌ద్ద రాకెట్ దాడి

0 5,756

ఆఫ్ఘనిస్థాన్ ముచ్చట్లు :

ఆఫ్ఘనిస్థాన్ పౌరుల‌తో పాటు ఇత‌ర దేశాల ప్ర‌జ‌లు రాజధాని కాబుల్ విమానాశ్ర‌యం నుంచి విదేశాల‌కు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉగ్ర‌వాదులు దాడుల‌కు తెగ‌బ‌డుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన భారీ ఉగ్ర‌దాడిని మ‌ర‌వ‌క ముందే ఈ రోజు ఉద‌యం 6.40 గంటలకు మరోసారి రాకెట్ దాడి జరిగింది. ఉగ్ర‌వాదులు ఓ వాహనం నుంచి రాకెట్లను ప్రయోగించి దాడి చేసినట్లు అక్క‌డ మీడియా పేర్కొంది. దాడి వ‌ల్ల అక్క‌డ ప‌రిస‌రాలు పొగతో నిండిపోయాయి. కాబుల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని యూనివర్సిటీ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Rocket attack at Kabul airport

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page