రేప‌టి నుంచి వ్యాక్సిన్ దొర‌క‌దంటూ వ‌దంతులు.. పరుగులు తీసిన జనం

0 10,004

నిజామాబాద్ ముచ్చట్లు :

 

‘నిజం గడప దాటేలోపు.. అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది’ అంటారు. వ‌దంతులు ఎంత త్వ‌ర‌గా వ్యాప్తి చెందుతాయో తెలిపేందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది ఈ ఘ‌ట‌న‌. క‌రోనా వ్యాక్సిన్ల‌పై ఎన్నో అస‌త్య ప్ర‌చారాలు వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే వ్యాక్సిన్‌ తీసుకోకపోతే రేషన్‌ నిలిపేస్తారని నిజామాబాద్‌ జిల్లాలోని నవీపేట్ మండల కేంద్రంలో ప్ర‌చారం జ‌రిగింది. అంతేగాక‌, రేప‌టి నుంచి వ్యాక్సిన్లు అందుబాటులో ఉండ‌వ‌ని, ఈ రోజే చివ‌రిరోజ‌ని కొంద‌రు వ‌దంతులు వ్యాప్తి చేశారు. దీంతో ఈ రోజు ఒక్క‌సారిగా 700 మందికి పైగా ప్రజలు స్థానిక ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లివ‌చ్చారు. ఉదయం నుంచే క్యూల్లో నిల్చుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు 500 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Rumor has it that the vaccine will not be available from tomorrow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page