ఆదివాసీని ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్ళారు..!

0 8,752

మధ్యప్రదేశ్ ముచ్చట్లు :

అతని తప్పేం లేకపోయినా ఆ ఆదివాసీని చితకబాదారు.. ట్రక్కుకు కాళ్లను కట్టేసి ఈడ్చుకెళ్లారు.. తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని నీమూచ్ లో జరిగింది. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కన్హయ్య లాల్ భీల్ (45) అనే వ్యక్తి రోడ్డుపై వెళ్తుండగా చిత్తర్మల్ గుర్జర్ అనే పాల వ్యాపారి బైకుపై వచ్చి ఢీకొట్టాడు. ఇద్దరూ కిందపడిపోయారు. పాలు మొత్తం ఒలిగిపోవడంతో కన్హయ్యపై చిత్తర్మల్ దాడికి దిగాడు. తన స్నేహితులను పిలిపించి కొట్టించాడు. ఆ తర్వాత బాధితుడి కాలిని తాడుతో ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లారు. ఒక నిందితుడు అతడి మొహంపై తన్నాడు. బాధతో విలవిల్లాడుతూ అతడు వేడుకున్నా వినలేదు. ఒళ్లంతా రోడ్డుకి రాసుకుపోయి కన్హయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

Tags:Tribals tied to a truck and dragged away ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page