రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

0 9,259

రాజస్థాన్ ముచ్చట్లు :

 

 

రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రాజస్థాన్‌లోని రామ్‌దేవరా కర్నీ మాత దేవాలయాలను దర్శించుకొని తిరిగి ఇంటికి బయల్దేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఎంపీ సర్కారు కూడా మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: 11 killed in road accident in Rajasthan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page