సెప్టెంబరు 1 నుంచి 5 వ తేదీ దాకా మైసూరు దత్త పీఠంలో చతుర్వేద హవనం

0 27

తిరుపతి  ముచ్చట్లు:

 

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అభ్యర్థన మేరకు మైసూరు దత్త పీఠం లో సెప్టెంబరు 1 నుంచి 5 వ తేదీ వరకు ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస పంచాహ్నిక చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించనున్నారు.లోకక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్య వృద్ధి, అతివృష్టి, అనావృష్టి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అవతరించిన శ్రావణ మాసంలో బహుళ దశమి నుంచి ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. హోమ గుండాలు ఏర్పాటు చేసి నాలుగు వేదాల్లోని అన్ని మంత్రాలను పఠించి యజ్ఞేశ్వరునికి సమర్పణ చేస్తారు.ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు వేద విద్వాంసుల ప్రసంగాలు, రాత్రి 7 నుంచి 8 గంటల దాకా భజనలు, నృత్య రూపకం, సంగీత కచేరీలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

1వ తేదీ వేదోక్త యజ్ఞం – ప్రయోజనాలు అనే అంశంపై విజయవాడకు చెందిన బ్రహ్మశ్రీ వి. లక్ష్మీనారాయణ ఘనాపాటి ఉపన్యసిస్తారు. 2వ తేదీ చతుర్వేద హవనం – ప్రాశస్త్యం అనే అంశం మీద జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధరశర్మ ఉపన్యాసం ఉంటుంది.3వ తేదీ వేద భారతి – యజ్ఞ దేవతలు అనే అంశం మీద కర్నాటక రాష్ట్ర సంస్కృత విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య కె ఈ దేవనాథన్ ఉపన్యసిస్తారు. 4వ తేదీ ప్రస్తుత కాలంలో వేద హవనాలు – వాటి ఆవశ్యకత అనే అంశం మీద టీటీడీ ఎస్వీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ ప్రసంగిస్తారు. 5వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

 

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Chaturveda Havan at Mysore Datta Peetha from 1st to 5th September

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page