ఉద్యోగులను గౌరవంగా సన్మానించుకోవాలి- జె ఈవో  సదా భార్గవి

0 10,056

తిరుపతి ముచ్చట్లు:

 

భగవంతుని సేవలో,భక్తుల సేవలో సుదీర్ఘ కాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారిని గౌరవంగా సన్మానించు కోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి భావించారని జెఈవో  సదా భార్గవి చెప్పారు.టీటీడీ లోని వివిధ విభాగాల్లో పని చేస్తూ మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన 13 మందికి పరిపాలన భవనం ఆవరణంలోని సమావేశం హాలులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జెఈవో శ్రీమతి సదా భార్గవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పని చేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వాతావరణంలో ఇలాంటి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం ఆనందకరమన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారంతా శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యం గా గడిచేలా శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆశీస్సులు అందించాలని కోరారు. వీరందరికీ శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం వీరందరికీ కుటుంబసభ్యులతో సహా అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు. సంక్షేమ విభాగం డిప్యూటి ఈవో శ్రీ ఆనంద రాజు, పిఆర్వో డాక్టర్ రవి, టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల కార్యక్రమాల అధికారి శ్రీ లంకా విజయసారథి తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఉద్యోగ విరమణ చేసింది వీరే.డి.వెంకట సుబ్బయ్య ( సూపరింటెండెంట్)  ఆర్.భాస్కరయ్య ( ఆఫీస్ సబార్డినేట్) .పి.నరసింహులు ( సీనియర్ అసిస్టెంట్)  కె.తిరుపాల్ ( ఆఫీస్ సబార్డినేట్)  పి. రామ్మూర్తి ( అసిస్టెంట్ షరాబ్)  పి.నాదముని ( దఫెదార్)  కె ఎల్లమ్మ ( దఫెదార్)  ఎం. ఎస్. గంగాధరం ( మజ్దూర్)  ఆర్.కృష్ణయ్య ( కేటరింగ్ సూపర్ వైజర్) .కె వెంకట ముని కృష్ణా రెడ్డి ( డ్రైవర్)  ఐ. మల్లారెడ్డి ( ప్లేట్ మేకర్)  డి.జగన్నాథం ( గార్డెనర్) .డి.భాస్కరరెడ్డి ( పడితారం క్యారియర్)

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Employees should be treated with respect- J Evo Sada Bhargavi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page