పుంగనూరులో రాజుకాలువలో పూడికతీత పనులు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 70

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రాజకాలువల్లో పూడిక తీసే కార్యక్రమాలను మంగళవారం నుంచి చేపట్టినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. పట్టణంలోని నాగపాళ్యెం, ఎంఎస్‌ఆర్‌ వద్ద, ఎంబిటి రోడ్డు, బాలాజి థియెటర్  వద్ద ప్రాంతాలలో రాజకాలువలు పూడిపోవడంతో వర్షపు నీరు ఇండ్లలోనికి చేరుతోందని కౌన్సిలర్లు అర్షద్‌అలీ, తుంగామంజునాథ్‌ లు ఫిర్యాదు చేశారు. దీనిపై పారిశుద్య సిబ్బంది కాలువలో పూడికతీసి , మట్టిని కంపోస్ట్యార్డుకు తరలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని కాలువల్లోను పూడికమట్టిని తొలగించి, పారిశుద్ధ్య కార్యక్రమాల వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. క్లాప్‌ కార్యక్రమాన్ని పకడ్భంధిగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ అర్షద్‌అలీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

Tags:Excavation work at Rajukaluva in Punganur – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page