తెలంగాణలో భారీ వర్షాలు..

0 9,689

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మానేరు వాగు ఉద్థృతంగా ప్రవహిస్తోంది. మానేరు వాగుపై ఉన్న లోలెవెల్ వంతెనపై నిన్న ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ఈ ఉదయం ప్రవాహ ఉద్ధృతి మరింత పెరగడంతో బస్సు కొట్టుకుపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సును బయటకు తీసేందుకు అధికారులు సాహసించలేకపోయారు. నిన్న నీటిలో చిక్కుకున్న సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నిన్న బస్సును జేసీబీ సాయంతో తీసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తర్వాత నీటి ప్రవాహం మరింత పెరగడంతో బస్సును తీసే ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Heavy rains in Telangana ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page