తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై హైకోర్టు స్టే..

0 9,268

హైదరాబాద్ ముచ్చట్లు :

 

రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులపై ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా ఎలాంటి హామీలు తీసుకోరాదని చెప్పింది. ప్రత్యక్ష తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకూడదని ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఆన్ లైన్ బోధనను కొనసాగించాలని ఆదేశించింది. రేపటి నుంచి స్కూళ్లను రీఓపెన్ చేస్తున్న నేపథ్యంలో హైకోర్టులో పిల్ దాఖలైంది. కరోనా వైరస్ తగ్గిందని చెప్పడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని పిటిషన్ దారుడు తన పిటిషన్ లో ప్రశ్నించారు. విచారించిన కోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది.

- Advertisement -

పుంగనూరులో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; High court stays school opening in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page